మిమ్మల్ని ఎలా క్షమాపణలు కోరాలో తెలియడం లేదు : సీఎం ఒమర్ అబ్దుల్లా

-

జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పహెల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిన విషయం తెలిసిందే.ఈ దాడి తర్వాత స్థానిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం కశ్మీర్ అసెంబ్లీలో ఉగ్రదాడిపై చర్చ జరిగింది.మొదట కశ్మీర్ అసెంబ్లీ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.

ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా సభలో మాట్లాడుతూ..‘ఈ ఉగ్రదాడి మొత్తం దేశాన్ని ప్రభావితం చేసింది. గతంలో ఇలాంటి దాడులు చాలా చూశాం. బైసారన్‌లో 21 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగింది.మృతుల కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో నాకు తెలియలేదు. హోస్ట్‌గా, పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపడం నా కర్తవ్యం. నేను అది చేయలేకపోయాను. క్షమాపణ అడగడానికి నా దగ్గర మాటలు లేవు’ అని సీఎం ఒమర్ అబ్దుల్లా భావోద్వేగం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news