టిఆర్ఎస్ పార్టీకి తాను 15 కోట్లు ఇచ్చానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. దానికి దిలీప్ కుమార్, కల్వకుంట్ల కవితే సాక్ష్యం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడినాటికి నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణను కెసిఆర్ దరిద్ర తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఉద్యమం సమయంలో తనను చాలాసార్లు కలిసిన కేసిఆర్ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.
కెసిఆర్ అవినీతిపై మాట్లాడితే కొందరు తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. కెసిఆర్, కేటీఆర్ రోడ్లపై తిరిగితే ప్రజలు కొడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మునుగోడులో బీసీ కి గాని, దళితులకు గాని పార్టీలు ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావంటూ కామెంట్ చేశారు. నియోజకవర్గంలోని 175 గ్రామాల్లోనూ ప్రజాశాంతి పార్టీకి కమిటీలు ఉన్నాయని.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.