“నేను కూడా ఐపీఎస్ అధికారిగా పని చేశా.. ఆ విషయం తెలుసు” : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

-

కాంగ్రెస్ ప్రభుత్వం  సీఎం రేవంత్ రెడ్డి పై  బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కుట్ర పూరితంగానే చక్రధర్ గౌడ్ చేత కేసు పెట్టించారని ఆరోపించారు. అధికారులను పావులుగా వాడుకుని హరీష్ రావును ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారని అన్నారు.

RSP

హరీష్ రావు ఏడు సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోవిడ్ సమయంలో వైద్యారోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో పాలుపంచుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక కేసులో హరీష్ రావు ను ఇరికించి.. ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని హామీలపై ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావుపై కక్ష గట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version