తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ప్రభుత్వానికి ఆశించిన మేర మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ‘ నేను మారాను మీరు కూడా మారండి. బుధవారం మంత్రులందరికి నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశా. మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి.
నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించాను. అందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను.ఏడాది పాలన అనుభవాలు, వచ్చే నాలుగేళ్లు ఉపయోగపడతాయి.
ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత,కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి.
పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండండి.మనకు తెలిసి ఏ తప్పు చేయలేదు కానీ, జరిగిన తప్పులను సరి చేసుకున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.