తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ విద్యాలయాలు ఇటీవల సమస్యల వలయాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.తరచూ ఏదో ఒక సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలకు గురుకులాలు ప్రధాన అస్త్రాలుగా మారాయి.
ఈ క్రమంలోనే గురుకుల పాఠశాలలు, హాస్టల్స్,రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల బాధ్యతలను ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఇక బాలికల వసతి గృహాల్లోనూ మహిళా ఐఏఎస్ అధికారులు రాత్రి నిద్ర చేయాలని, వసతులపై సమగ్ర నివేదిక తయారుచేసి జిల్లా కలెక్టర్లకు అందజేయాలని నిన్న రాత్రి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ల ఆధ్వర్యంలో గురుకులాలు నడవనున్నాయి. విద్యార్థులకు చదవు, సంక్షేమం, మంచి భోజనం, మంచి వాతావరణం కల్పించే బాధ్యత వారిపైనే ఉంది.
గురుకుల పాఠశాలలు, గురుకుల హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం
బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు రాత్రి నిద్ర చేయాలని, వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు pic.twitter.com/CRBJYlRbea
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025