తెలంగాణ రూరల్ డెవలప్మెంట్,మహిళా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కేరళలో జరుగుతున్న దళిత ప్రగతి సదస్సుకు హాజరయ్యారు.కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన దళిత ప్రగతి సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క శుక్రవారం ఉదయం కీలక ప్రసంగం చేశారు.
‘ఒక ఆదివాసీ మహిళగా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించాను. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఈరోజు పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా స్త్రీ సంక్షేమం మంత్రిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను’ అంటూ ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది.