మయన్మార్‌, బ్యాంకాక్‌లో భూకంపం.. ప్రధాని మోదీ ఆరా

-

మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలను శుక్రవారం రోజున వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ప్రకంపనల ధాటికి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో అనేక భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బ్యాంకాక్‌ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు భూ ప్రకంపనలు భవనాలు, ఇళ్లను కుదిపేయగా ప్రజలు భయంతో విధుల్లోకి పరుగులు తీసినట్లు తెలిపాయి.  రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత బ్యాంకాక్‌లో 7.3, మయన్మార్‌లో 7.7గా నమోదైనట్లు పేర్కొన్నాయి. అయితే ఈ విపత్తుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని ఆయన అన్నారు. అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారికి అవసరమైన సాయం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరినట్లు ప్రధాని మోదీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version