RGV : నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి.. వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్

-

వివాదాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది. ఆయ‌న నోటి దూలతో ఆయ‌న డైలాగ్స్.. ఆయ‌న చేతి దూలతో ట్వీట్స్ ఎప్పుడు వార్త‌లో ఉంటాయి. ఇక ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. కేఏ పాల్ పై ఫోక‌స్ పెట్టి ఈ మ‌ధ్య కాలంలో వ్య‌గ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజా గా రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది.

ఈ ట్వీట్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ఒక ఫోటో ను కూడా పంచుకున్నారు. ఈ ఫోటో లో వ‌ర్మ‌.. ఒక చిన్న కుక్క పిల్ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఉన్నాడు. ”కొన్ని సార్లు నాకూ ఫిలింగ్స్ ఉంటాయి” అంటూ క్యాప్షన్ ను కూడా జోడించారు. దీంతో నెటిజ‌న్లు ఈ ఫోటోను ఆయ‌న క్యాప్షన్ వైర‌ల్ చేస్తున్నారు. అలాగే కొంత మంది నెటిజ‌న్లు.. ‘మీరు మారారా.. అందుకే యుద్ధాలు వ‌స్తున్నాయి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రి కొంద‌రు వ‌ర్మ సారు.. డ్రింక్స్ తీసుకున్నారా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇటీవ‌ల ఛార్మీ మందు గ్లాస్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. డ్రింక్స్ పార్టీ విత్ స‌ర్కార్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ట్వీట్ కూడా ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news