కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు లంచం వ్యవహారంలో తనకు సంబంధం లేదని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అనవసరంగా బురద చల్లితే న్యాయపరమైన చర్యలకి దిగుతానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ జిల్లా కలెక్టర్ గా వచ్చి మూడు నెలలు అవుతుందన్న ఆయన రాంపెల్లి దయరాకి సంబందించిన ఎటువంటి ఫైల్ కూడా తన వద్దకు రాలేదని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఆరోపణలు వినిపించిన కీసర ఆర్డీవో రవి కూడా ఈ కేసుతో సంబంధం లేదని అంటున్నారు.
అసలు రాంపెల్లి దయరాకి సంబంధించి తనను ఎవరూ కలవలేదని, తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్స్ తో అధికారులు పాత్ర పై ఏసీబీ విచారణ చేపడుతుంది. హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్, కీసర ఆర్డీవో, కలెక్టర్ పాత్ర మీద ఏసీబీ వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలు నిజం అయితే త్వరలోనే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా అధికారులకు విచారణ నిమిత్తం నోటిసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు.