విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు.. ఇక్కడే తెలంగాణలోనే ఉంటా – కేఏ పాల్

-

మునుగోడు ఉప ఎన్నికలలో 50 వేల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఫలితాలలో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 500 ఓట్లు కూడా కేఏ పాల్ కి రాలేదు. కేఏ పాల్ ఉంగరం గుర్తుకు కేవలం ఆరో రౌండు పూర్తయ్యేసరికి 261 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈవీఎంల పనితీరుపై తనకు నమ్మకం లేదని అన్నారు కేఏ పాల్.

ఇదంతా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలో కుట్రగా భావిస్తున్నామని అన్నారు. మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లడే తాను ఓడిపోయినట్లు వెల్లడించారు. మునుగోడు ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తే తానే గెలుస్తానని అన్నారు. ఇక విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని.. ఇక్కడే తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. పైకి పంపిస్తా.. అని చెప్పగానే దానికి వచ్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version