Vestibular Hypofunction: అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలివుడ్‌ హీరో

-

సినిమా వాళ్లకే చాలా అరుదైన వ్యాధులు వస్తుంటాయి.. మనలాంటి వాళ్లకు కనీసం వాటిపేర్లు కూడా తెలియదు.. కానీ వారు పాపం ఆ వ్యాధులతో బాధపడుతుంటారు. యాంకర్‌ సుమ నుంచి నటి సమంత వరకూ చాలామందికి తమ వ్యక్తిగత జీవితాల్లో ఏవేవో అరుదైన వ్యాధులు ఉన్నాయి. తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరాడు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుదై వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడీ యంగ్ హీరో. ఈ వ్యాధి కారణంగా కారణంగా ప్రాథమికంగా బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని, ఫలితంగా చాలారోజుల పాటు షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. అసలు వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్స, నివారణ పద్ధతులు తదితర విషయాలేంటో..

చెవిలోపలి భాగంలో..

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌ చెవికి సంబంధించిన వ్యాధి. దీనికి కారణాలు జన్యుపరమైనవి కావచ్చు, న్యూరోడెజెనరేటివ్, టాక్సిక్, వైరల్ లేదా ట్రామాటిక్‌ కారణాలతో సంభవించవచ్చు. చెవిలో ద్రవంతో నిండిన సెమికర్యులర్ ఛానల్ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఈ ద్రవం స్థానం మారుతుంది. చెవిలోని ఈ భాగం నుంచే డేటాను స్వీకరిస్తుంది మెదడు. ఇది దెబ్బతింటే మెదడుకు సందేశాలు సరిగ్గా పంపడంలో సమస్యలు వస్తాయి. ఫలితంగా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. కళ్లు తిరగడం, చూపు మసకబారడం, నడిచేటప్పుడు చూపు సమస్యలు వంటి కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో ఇది తల ఒక వైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేయవచ్చు.
దీని బారిన పడిన వారిలో వికారం, విరేచనాలు, వాంతులు, ఆందోళన, భయం, గుండె సంబంధిత వ్యాధులు కనిపిస్తాయి. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కానీ.ప్రాణాంతకం అయితే కాదు.. దీనికి చికిత్స ఉంది. ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. కొన్ని వ్యాయామాల ద్వారా ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. సరైన నిపుణులను సంప్రదిస్తే చాలు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే..వెంటనే వైద్యులను సంప్రదించండి చాలు.! లక్షణాలు ఒకటే ఉన్నా రోగాలు మాత్రం చాలా ఉంటాయి అనేది మనం గమనించుకోవాలి. ఎప్పుడూ ఉండేదేలే అని అస్సలు లైట్‌ తీసుకోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version