స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత వాస్తవంగా దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అన్న సినిమా చేయాల్సి ఉంది. కాని మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురములో సినిమా చేసి రికార్డ్స్ క్రియోట్ చేశాడు. చెప్పాలంటే అల్లు అర్జున్ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
అయితే ఈ సినిమా తర్వాతైనా దిల్ రాజు – వేణు శ్రీరామ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ సెట్స్ మీదకి వస్తుందనుకున్నారు. కాని మళ్ళీ సీన్ రివర్స్ అయింది. తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో సెట్స్ మీదకి వెళ్ళాడు అల్లు అర్జున్. పుష్ప టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారి బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేయనటువంటి ఒక మాసీ క్యారెక్టర్ ఈ సినిమాలో చెస్తున్నాడు. ఇక అయిదు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.
దాంతో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ఆగిపోయిందని ఇక ఈ ప్రాజెక్ట్ ఉండదని అందరు భావించారు. కాని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రోజే ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ లుక్ ద్వారా దిల్ రాజు బృందం అల్లు అర్జున్ కి బర్త్ డే విషేస్ తెలిపి ప్రాజెక్ట్ ని కన్‌ఫర్మ్ చేశారు. దీంతో అందరికి ఐకాన్ మీద కంప్లీట్ గా క్లారిటి వచ్చింది. అయితే ఐకాన్ ఒక ఎక్స్‌పెర్మెంటల్ మూవీ కావడంతోనె అల్లు అర్జున్ కాస్త టైం తీసుకున్నాడని తాజా గా అప్‌డేట్ ని ఇచ్చారట. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని రూపొందింస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నాడని లేటెస్ట్ న్యూస్.