రజినీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం : షారుఖ్ ఖాన్

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీ తో జత కట్టి జవాన్ అన్న మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. కాగా ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేయడానికి షారుఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు.అయితే ఒక ఫ్యాన్ ఈ రోజు జైలర్ మూవీ రిలీజ్ అయింది కదా… మీరు చూస్తారా అంటూ ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా షారుఖ్ ఖాన్ .. తప్పకుండా జైలర్ మూవీ కి వెళ్తాను .. రజినీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కాగా ఈ రోజు రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ థియేటర్ లో విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news