నేను ముందే చెప్పాను కానీ… మోదీ వినలేదు: రాహుల్ గాంధీ

-

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటినా ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. ప్రజల ముందుకు రాకుండా కనబడకుండాపోయిందన్నారు.

rahul

‘ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండి.. ఇదే స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూపోతే.. ఆగస్ట్ నెలలోగా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుంది’ అంటూ జులై 17న తాను చేసిన ట్వీట్​ను రాహుల్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయింది. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం కనబడటంలేదు అని రాహుల్ గాంధీ అన్నారు.కరోనా కేసుల్లో అమెరికా , బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉంది భారత్. కరోనా బారిన పడి ఇప్పటికే దాదాపు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version