లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఇక తన అరెస్టుని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మే 17 న సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.’కేజ్రీవాల్ కేసులో ఉత్తర్వులు నాకూ వర్తిస్తాయి’ అంటూ హేమంత్ సోరెన్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో.. న్యాయస్థానం ఈడీకి నోటీ జారీ చేసింది. ఇక తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడంతో దానిని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.