IPL 2024 : క్లైమేట్ ఎఫెక్ట్.. ఆలస్యం కానున్న టాస్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్లో ఆకాశం మేఘావృతమైంది. వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో 9 గెలిచి ప్లే ఆఫ్ కు అర్హతను సాధించిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడితే కచ్చితంగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version