విద్యార్థులకు అండగా నేనుంటా : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ విద్యార్థుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకటించిన సందర్భాన్ని గుర్తుచేశారు. ‘అన్నగా తోడుంటా..ఆత్మ విశ్వాసనిచ్చే సేవకుడవుతా..రేపటి తెలంగాణను నిర్మించే..ఈ బిడ్డల భవితను..నిర్మించే శ్రామికుడవుతానని ట్వీట్ చేశారు.

గురుకులాలు, హాస్టళ్లలో ఎదురవుతున్న నాసిరకం భోజనం, ఫుడ్ పాయిజన్ ఘటనలక చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో తాజాగా ఏటా రూ.470 కోట్ల ఖర్చుతో కొత్త మెనూ ప్రకటించింది. ప్రతి రోజూ ఉదయం రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడురకాల పదార్ధాలు, గుడ్డు, నెలకు ఆరుసార్లు మాంసహారంతో కూడిన భోజనం అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీంతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాల్లో చదువుతున్న 8 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version