అలా జరగడం వల్లే చనిపోదాం అనుకున్నా.. వెంకటేష్ హీరోయిన్.!

-

ఇటీవల కాలంలో చాలామంది సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ భారిన పడుతున్నామని ధైర్యంగా మీడియా ముందు చెబుతున్న విషయం తెలిసిందే. నిజానికి స్టార్ హీరోల హీరోయిన్ల విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రముఖ హీరోయిన్ గా పేరు పొందిన ఈమె..తన గురించి కొన్ని విషయాలు బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అసలు విషయంలోకెళితే.. వెంకటేశ్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ లో నటించిన ఆశా షైనీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను వెల్లడించింది. ఇది ఇలా ఉండగా మరోవైపు.. శ్రద్ధ వాకర్ హత్య కేసు తీవ్రదుమారం రేపింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడారు. ఈ క్రమంలోని టాలీవుడ్ లక్స్ పాప నటి ఆశా షైనీ కూడా స్పందించడం జరిగింది.

తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన గృహించ గురించి బయట పెట్టింది.. 2007లో తన బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ జోషి తనని చిత్రహింసలకు గురిచేసాడు అని తీవ్రమైన లైంగిక వేధింపులకు అతడు పాల్పడినట్లు తెలిపింది. 2018 లో మీ టు ఇష్యూ సమయంలో కొన్ని విషయాలు చెప్పిన ఆశ తాజాగా మరో ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయింది.. ఆశ మాట్లాడుతూ.. శ్రద్దా వాకర్ కు ఎలాంటి పరిస్థితి ఎదురయిందో నాకు కూడా అలాగే జరిగింది.

నా బాయ్ ఫ్రెండ్ నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అతనిలో మార్పు చేశాను. నన్ను హింసించేవాడు. పగ పట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. ఎందుకు కొడుతున్నాడో కూడా అర్థమయ్యేది కాదు.. ఒకరోజు దారుణంగా కొట్టడంతో దవడలు విరిగిపోయాయి. చనిపోతానేమో అనుకున్నాను ఒంటిమీద బట్టలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా ప్రాణం భయంతో పరిగెత్తాను అంటూ తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను తెలిపింది. ఆశా..ఇక ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version