ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు రూ.1000 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తాను కోరిన నిధులను మంజూరు చేయాలన్నారు.శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంలో తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు.
సీఎం రేవంత్ మాత్రం తన నియోజకవర్గం కొడంగల్‌కు రూ.వెయ్యి కోట్లు తీసుకెళ్లారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మీరు వెయ్యి కోట్లు తీసుకుని.. తమకు రూ.90 లక్షలు ఇస్తారా? ఇదేం వ్యత్యాసం అని ఆయన కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీశారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో దానికి పార్టీలతో తేడా లేకుండా వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://twitter.com/Telugu_Galaxy/status/1901514149970260188