హోంగార్డు రవీందర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రవీందర్ భార్య సంధ్య కోసం ఎదురు చూశారు. సంధ్య రాగానే ఆమెతో సంతకం చేయించి రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులు చూస్తున్నారు. దీంతో ఉస్మానియా మార్చురీ వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనకు న్యాయం జరిగేంతవరకు పోస్టుమార్టంకు ఒప్పుకోనని కన్నీరు మున్నీరయింది సంధ్య.
మరోవైపు హోంగార్డు భార్య సంధ్యను ఒప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల మాటను పక్కకు పెట్టి తనకు న్యాయం చేయాలని అప్పటివరకు సంతకం పెట్టనని పోస్ట్మార్టం చేసేందుకు అనుమతి ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నా భర్త 17 ఏళ్లుగా ఎంతో సిన్సియారిటీగా డ్యూటీ నిర్వహించారని రోధించింది. నిజాయితీగా పనిచేశాడని నాకు నిబంధనలు ఉల్లంఘించానని పైన కూడా వేశాడని తన వద్ద ప్రూఫ్ ఉందని చెప్పాడు. నా భర్త ఫోను మొత్తం అన్లాక్ చేసి డేటా మొత్తం డిలీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నా భర్త రవీందర్ చాలా తెలివైన వాడని.. తన భర్త తనతో మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తను ఏఎస్ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపారని ఆరోపించారు. ఇప్పటివరకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేయలేదని సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. నా భర్తను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హమీద్ అనే అధికారి తన వద్దకు వచ్చి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని సిగరెట్ తాగుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పమని తనను బెదిరించినట్టు మీడియా ముందు వాపోయింది సంధ్య. అప్పుడు నీకు బెనిఫిట్స్ అన్ని వస్తాయని నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కన్నీరు మున్నీరయింది.