హోంగార్డు రవీందర్ ను కేసీఆర్ ప్రభుత్వమే చంపేసింది : బండి సంజయ్

-

హోంగార్డ్ రవీందర్ ను కేసీఆర్ ప్రభుత్వమే హత్య చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ముమ్మాటికీ హోంగార్డ్ చావుకు బాధ్యత వహించాల్సింది కేసీఆర్ సర్కారే… పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. నిజాయితీగా పనిచేస తన భర్తను కొందరు పోలీసులు వేధించారని… చంపింది కూడా వారేనని హోంగార్డ్ రవీందర్ భార్య ఆరోపిస్తున్నారు.

ఆమె అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై వుందన్నారు. కాబట్టి వెంటనే రవీందర్ ఘటన సమయంలోని గోషామహల్ కమాండెంట్ హోంగార్డు కార్యాలయం వద్ద ఏం జరిగిందో బయటపెట్టాలని అన్నారు. అక్కడ సిసి ఫుటేజీ బయటపెట్టాలని సంజయ్ కోరారు. ఇక రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేసారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన రవీందర్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సంజయ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version