రాబోయే దేశవాళి సీజన్ లో పంజాబ్ తరఫున ఆడటానికి టీం ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అంగీకరించాడు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడటానికి బోర్డు అనుమతి కోరుతూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు యువరాజ్. యువరాజ్ ప్లేయర్ కమ్ మెంటర్ పాత్రలో పంజాబ్ జట్టుకు తిరిగి రావాలని భావిస్తున్నట్టు అతను లేఖలో పేర్కొన్నాడు.
ఈ ఏడాది యువరాజ్ పంజాబ్ జట్టుకు చెందిన బ్యాట్స్మెన్లు షుబ్మాన్ గిల్ మరియు అన్మోల్ ప్రీత్ సింగ్ వంటి యువ ఆటగాళ్ళతో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. నేను దేశీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను. నేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి అనుమతి తీసుకుంటే… ప్రపంచ వ్యాప్తంగా విదేశీ లీగ్ లలో కూడా ఆడాలని భావిస్తున్నా. మూడు నాలుగు వారాల పాటు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.