బీర్ఎస్‌లోకి మాజీ ఎంపీటీసీ వెంకటరమణ.. పలువురు నేతలు

-

బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఆ పార్టీని వీడి గులాబీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిలు జరిగాయి.

ఈ క్రమంలోనే హుజుర్ నగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ మేళ్లచెరువు వెంకటరమణ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పాలన తీరుకు, రేవంత్ మాయమాటలకు.. నెరవేర్చలేని హామీలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతో ఆ పార్టీలో కొనసాగలేక కాంగ్రెస్ నేతలు స్వచ్చందంగా BRSలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ రాక్షస పాలన తీరుకు.. స్థానికంగా నీళ్ల మంత్రి ఉండికూడా ఎండిన పొలాల దుస్థితి, అరకొరగా చేతికొచ్చిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం, మద్దతు ధర విషయంలో రైతన్నల గోసలను తట్టుకోలేక హస్తం పార్టీని వీడుతున్నారని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news