పంజాబ్ కింగ్స్ జట్టుపై స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేలం జరుగుతున్న నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ ను విలన్ చేస్తూ… క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆ జట్టులో మళ్లీ ఆడ బోనని… అదో పెద్ద టార్చర్ అంటూ వ్యాఖ్యానించాడు.
వాస్తవంగా 2020 సంవత్సరంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ తరఫున గౌతం ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గౌతమ్ కు జట్టు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదట. ఆయనను చాలా టార్చర్ పెట్టారట. అందుకే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ కృష్ణప్ప.
నేను ఏ జట్టుకు ఆడిన… 100% మంచి ప్రదర్శన అందిస్తానని వెల్లడించాడు. కానీ పంజాబ్ జట్టుకు మాత్రం అస్సలు ఆడనని తెల్చి చెప్పాడు. క్రికెట్ పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం… లేదని వివరించాడు. అసలు ఒక క్రికెటర్‌ను చూసుకునే విధంగా నన్ను చూసుకోలేదని బాంబు పేల్చాడు.