దేవరాయంజాల్ భూములపై విచారణ వేగవంతం… ఈవోపై చర్యలు

-

రంగారెడ్డి: దేవరాయంజాల్ భూములపై ఐఎఎస్ కమిటీ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కమిటీ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది.సీతారామ స్వామి గుడికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధారణ చేశారు. దేవాదాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో సీతారామస్వామి ఆలయ ఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం తప్పించింది. అంతేకాదు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసింది. దేవాదాయశాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని సైతం అధికారులు తొలగించారు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక సీతరామ స్వామి టెంపుల్ ఈవోగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలక ఫైల్స్ ను కూడా ఈ కమిటీ స్వాధీనం చేసుకుంది. ఇక రోజువారి విచారణ కోసం తత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వివిధ శాఖల నుంచి సీనియర్ అధికారులను కూడా కమిటీ‌కి సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక ఈ దేవర యాంజల్ సీతారామస్వామి భూముల వివాదం కొద్ది రోజులుగా తెలంగాణలో దుమారం రేపింది. ఈ భూములను ఈటల కబ్జా చేశారని ఆయన మంత్రి పదవిని కూడా తప్పించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ మంత్రులైతే బహిరంగంగానే ఈటల రాజేందర్‌ను విమ

Read more RELATED
Recommended to you

Exit mobile version