క్రికెట్ మ్యాచ్ చూసే వారికి చాలా మందికి అర్ధం కాని విషయ౦ ఒకటి ఉంటుంది. అది ఏంటీ అంటే బాల్ విసిరే ముందు బౌలర్ నోట్లో ఉన్న లాలా జలమో చేతికి ఉన్న చెమటనో బంతికి తుడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా స్పీడ్ బౌలర్లు చేస్తూ ఉంటారు. దీని ద్వారా బంతి మంచి స్వింగ్ అవుతుంది అనేది బౌలర్ నమ్మకం. కొంత మంది అయితే బంతిని మరి తడిపేస్తు ఉంటారు.
ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరం అని చెప్తుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీని ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పుడు ఆ అవసరం లేదని తాము కొత్త పరికరాన్ని తయారు చేసామని ప్రముఖ బంతుల తయారి కంపెనీ కూకుబుర్రా చెప్తుంది. వ్యాక్స్ అప్లికేటర్(మైనపు పొర) పరికరం తో ఆ పని చేయవచ్చు అని తెలిపింది. అయితే ఈ పరికరం ఇప్పటివరకు ప్రయోగశాలలో బాగానే పని చేసింది అని పేర్కొంది.
అయితే దీని ద్వారా బాల్ ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఉమ్ము అయితే వెంటనే ఆరిపోతుంది గాని మైనం ఆరే అవకాశం ఉండదు అని దాని ద్వారా బంతికి మట్టి అంటుకోవడం చిన్న చిన్న రాళ్ళు అంటుకోవడం ద్వారా దాని రూపు మారుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.