నిన్న ఐసీసీ ప్రకటించిన మహిళల వరల్డ్ ర్యాంక్ లలో ఇంగ్లాండ్ కు చెందిన ఆల్ రౌండర్ నటాలీ సీవర్ మొదటి స్థానికి చేరుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ లో నటాలీ సీవర్ మూడు వన్ డే లలో వరుసగా 31, 111 మరియు 129 పరుగులు చేసి ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డును అందుకుంది. ఇక వరల్డ్ ర్యాంకింగ్ లోనూ అద్భుతమైన మెరుగుదలతో రెండవ స్థానం నుండి మొదటి స్థానానికి ఎగబాకింది. అంతకు ముందు శ్రీలంక ప్లేయర్ చమర ఆటపట్టు మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. ఇక ఆస్ట్రేలియా కు చెందిన బెత్ మూనీ మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ర్యాంకింగ్ లో నటాలీ కెరీర్ లో అత్యుత్తమ వన్ డే పాయింట్ లను సాధించింది.. ఐసీసీ ప్రకటించిన ప్రకారం నటాలీ ప్రస్తుతం 803 పాయింట్ లతో ఉంది.
కాగా మహిళా వన్ డే క్రికెట్ లో ఈమె కు ముందు మెగా లానింగ్ తన కెరీర్ లో పాయింట్లు సాధించడం విశేషం. ఇక నటాలీ అల్ రౌండర్ జాబితాలోనూ ఈమె మొదటి స్థానంలో ఉండడం విశేషం.