ఫోర్త్‌ వేవ్‌పై కీలక విషయాలు వెల్లడించిన ICMR

-

కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోంది. ఇప్పటికే చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే భారత్‌లో కూడా మళ్లీ కరోనా కేసుల పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందిస్తూ.. ఇది ఫోర్త్ వేవ్ కు సంకేతమంటూ ప్రచారం జరుగుతోందని.. కానీ.. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవలి డేటా వెల్లడిస్తోందని వెల్లడించిన ఐసీఎంఆర్.. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్నిచోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని వివరణ పేర్కొంది.

ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ.. ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని అన్నారు. తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉన్నదని చెప్పలేమని తెలిపారు. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version