అమ్మో : చైనా నుండి మరో వైరస్.. ఇండియాలో రెండు కేసులు ?

-

చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్. హెచ్చరించింది. క్యాట్ క్యూ వైరస్ ఇండియా మీద దాడికి సిద్ధంగా ఉందని తెలిపింది ఐసీఎంఆర్. అంతే కాదు ఇప్పటికే ఇండియాలో ఈ వైరస్ ఇద్దరికీ సోకినట్టు చెబుతున్నారు. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాపు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా వారందరిలో ఇద్దరిలో ఈ సీక్యూవి యాంటీ బాడీస్ కన్పించాయి. కానీ ఆ ఇద్దరిలోనూ వైరస్ లక్షణాల్లేవు. దాంతో మరి కొంత మంది వ్యాధికి గురయ్యే ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మరి కొంతమంది శాంపిల్స్ కూడా పరీక్షించాల్సిన అవసరముందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది. భారత్‌ లోనూ పందులు, దోమలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది ఐసీఎంఆర్. ఏజిప్టీతో పాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైరస్ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని తెలిపింది ఐసీఎంఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version