దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పై ఐసీఎంఆర్-సీరో చేసిన సర్వేలో కీలక విషయాలు బయట పడ్డాయి. ఆగస్టు నాటికి 20 కోట్ల మందికి వైరస్ వచ్చి పోయినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. అలానే 10 ఏళ్లు పైబడిన వాళ్లలో 15 మందిలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిపింది. అంతే కాదు దేశ ప్రజలకు కరోనా ముప్పు ఇంకా పొంచే ఉందని ఈ సర్వే లో వెల్లడయింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. పట్టణాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని మురికివాడల్లో ఇది 15.6 శాతం ఉందని సర్వేలో వెల్లడైంది.
ఇక, గ్రామీణ ప్రాంతాల్లో 4.4 శాతం కరోనా ప్రభావం ఉందని ఐసీఎంఆర్ ప్రకటించింది. వయసు, ఆడ, మగ తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. శీతాకాలంలో వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం పెరుగుతుందని హెచ్చరించింది. ఇంతే కాదు కరోనా వచ్చిపోయిన సంగతి కూడా తెలియకుండా అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా 15 మందిలో ఒకరికి కరోనా వచ్చి వెళ్లిపోయిందట. వాళ్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండటం వల్ల కరోనా దానంతట అదే తగ్గిపోయిందని ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడయింది.