స్మార్ట్ ఫోన్ తో కరోనాను గుర్తించవచ్చా…?

-

కరోనా వైరస్ ని గుర్తించడానికి గానూ ఎవరి వంతు పరిశోధనలు వాళ్ళు చేస్తున్నారు. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు పెరగడంతో పరిశోధనలను వేగవంతం చేసారు. కరోనా ఎవరికి ఉందో చెప్పడం చాలా కష్టం. దాన్ని గుర్తించడానికి పరిక్షలు మినహా మార్గం లేదు. అయితే కరోనా వైరస్ ని ఫోన్ కెమెరా ద్వారా గుర్తించవచ్చు అని అంటున్నారు. దానిని గుర్తించడానికి గానూ పాత్‌ట్రాకర్‌ అనే సరికొత్త సాధనాన్ని అభివృద్ధి చేసారు.

స్మార్ట్ ఫోన్ సాయంతో ఇది పని చేస్తుండగా వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఈ పరికరంతో 30 నిమిషాల్లో కనిపెట్టే అవకాశం ఉంటుంది. 50 డాలర్లు(సుమారు 3,800) దీని ధర. దీని వలన కరోనా టెస్టింగ్ ల్యాబ్ ల మీద ఉండే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ కన్నింగ్‌హాం నేతృత్వంలోని బృందం తయారు చేసారు.

పరీక్ష కారకాల క్యాట్రిడ్జ్‌తో కూడిన పాత్‌ట్రాకర్‌ లోపల ఓ చిన్నపోర్టు ఉంచుతారు. కరోనా అనుమానిత వ్యక్తి నుంచి సేకరించిన స్వాబ్‌ కానీ రక్త నమూనాను కానీ ఆ పోర్టులో ఉంచగా… క్యాట్రిడ్జ్‌ లోపల ఉండే కొన్ని కారకాలు వైరస్‌ల పైభాగాన్ని పగులగొట్టి ఆ తర్వాత దాని ఆర్‌ఎన్‌ఏను సేకరిస్తారు. ప్రాథమికంగా లభించే అణువు 15 నిమిషాల్లో లక్షల సంఖ్యలో జన్యు పదార్థాలుగా మారుతుంది.

ఫ్లోరోసెంట్‌ రంగు మరకల్లా ఉండే ఆ జన్యు పదార్థాలపై నీలిరంగు లెడ్‌ వెలుతురు పడితే అవి ఆకుపచ్చ రంగుకి వస్తాయి. వీటిని స్మార్ట్ ఫోన్ లో ఉండే కెమెరా ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. పాత్‌ట్రాకర్‌పై ఉండే క్లిప్‌తో దానిని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించుకోవడం ద్వారా… విమానాలు ఎక్కబోయే ముందు ప్రయాణికులకు, వివిధ కార్యక్రమాల ప్రారంభానికి ముందు ఆహ్వానితులకు ఈ పాత్‌ట్రాకర్‌ ద్వారా వేగంగా పరిక్షలు చేసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version