ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ఉంచాలి అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు. కాని అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ఆయన వైఖరిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆయనతో పాటుగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముందుకు రావాలి అని రోజా డిమాండ్ చేసారు. వారు అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అని ఆమె డిమాండ్ చేసారు. అమరావతిని ప్రజలు కోరుకుంటే ఈ పని వెంటనే చేయాలని ఆమె సవాల్ చేసారు. విశాఖలో తనను ఓడించారు అనే పవన్ కళ్యాణ్ విశాఖ రాజధానిగా వద్దు అని అంటున్నారు అని ఆమె పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.