కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొబైల్ బిల్లు రూ.5 వేలు పక్కా : ప్రధాని మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన త్రిపురలో మాట్లాడుతూ..జూన్ 4న రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నెల మొబైల్ బిల్లు రూ.5 వేలు వస్తుందని, అదే బీజేపీ హయాంలో నెల మొబైల్ బిల్లు రూ.400 మాత్రమే వస్తుందని తెలిపారు. 10 సంవత్సరాల ఎన్టీఏ పాలనలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని,తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. దేశంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్ల పాలనలో దేశంలో ఈశాన్య భాగమైన త్రిపుర అభివృద్ధి కేంద్రం కృష్టి చేసిందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో పేద ప్రజలు, పిల్లలు ఆకలితో ఉండకుండా లబ్ధిదారులందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయనుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version