మీరు మారరా? మీ బుద్ధి మారదా? : చంద్రబాబు

-

అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేయగా దుండగులు దాన్ని ధ్వంసం చేశారు. ఇక దీనిపై స్పందిస్తూ….’మీరు మారరా? మీ బుద్ధి మారదా? మీ వికృత పోకడలను ఇంటికి వెళ్లేముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే మీ నీచమైన చర్యలను మానుకోరా?’ అని వైసీపీపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెడనలో జరుగుతున్న రోడ్ షోలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారన్నారు. వచ్చే అసెంబ్లీఎన్నికల్లో టీడీపీదే అధికారమని, సర్వేలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు .పెడన ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు .గత ఎన్నికలకు ముందు కోడి కత్తి, గొడ్డలి డ్రామాలాడారని,ఇప్పుడు గులకరాయి డ్రామాలాడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version