కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు.ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందని తెలిపారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని అన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నానని ,ఇల్లంతకుంట దేవస్థానం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాని ఆయన అన్నారు. కేసీఆర్ లా దొంగ మాటలు నేను మాట్లాడలేనని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజలకు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన హామీలను కేబినేట్ లో చర్చించండి. ఇంకా ఇప్పటి వరకు హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఏదో ఒకటి, రెండు చిన్న హామీలు ఇచ్చి దాటెద్దామనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆక్రోశం, ఆవేశంతో ఉన్నారు అని అన్నారు.