అలా చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం ఖాయం – హరిరామ జోగయ్య

-

మాజీ మంత్రి హరీరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఐదేళ్లు సీఎం గా ఉండాలంటే జనసేన 175 స్థానాలలో పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని.. బిజెపితో కలిస్తే మోడీ చరిష్మా తోడై అదనపు బలం చేకూరుతుందన్నారు. గతం కంటే జనసేన బలం ఇప్పుడు పెరిగిందన్న ఆయన.. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అన్నారు.

టిడిపి జనసేనతో కలిస్తే ఇక వైసిపి ఓటమి ఖాయం అని జోష్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తేనే వైసీపీని ఓడించగలరని, అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ముందుగా ప్రకటించాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. పవన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటే బిజెపిని కలుపుకొని వెళ్లడం మంచిదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version