నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు : మాజీ మంత్రి వేముల

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవాడిగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను చనిపోతే నా పార్థివ దేహం పై జాతీయ జెండా కప్పుతారు అని అనడంతో అంతా సైలెంట్ అయ్యారు. మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది.. శాసన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాస్త ఎమోషనల్ అయ్యారు. ‘నేను చనిపోతే నా పార్థివ దేహం పై జాతీయ జెండా కప్పుతారు.అతికొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను’ అన్నారు. సభలో మాట్లాడుతుంటే సభ్యుల అంతరాయం కలిగిస్తున్నారు.అది లేకుండా చూడాలని సభాపతి గారికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news