మాజీ సర్పంచ్ హత్య.. సొంత కూతురు, అల్లురు సహా 11 మంది అరెస్టు

-

రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించిన కూతురు ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్యలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కారణంగా చక్రయ్య గౌడ్‌ను సొంత కూతురు, అల్లుడు సహా 11 మంది కలిసి అంతమొందించారు.

ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ 17న జరిగింది. మాజీ సర్పంచ్,కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్యకు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే కారణమని పోలీసులు తేల్చారు.గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్, సహకార సంఘం చైర్మన్‌గా చక్రయ్య గౌడ్ పదవులు అనుభవించారు.తనకు వైరి వర్గంగా మారాడనే కారణంతో మామ చక్రయ్య గౌడ్‌ను అల్లుడు ప్లాన్ ప్రకారం కూతురు మరో 11 మంది సాయంతో అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news