ఇండియా చంద్రుడిని చేరితే… పాక్ నేత సయ్యద్ ముస్తఫా కమల్ సెన్సేషనల్ కామెంట్స్

-

గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్… ఇప్పుడు భారత్ పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తోంది.ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పటి నుంచి పాక్ నేతలు ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పాక్ దుర్భర పరిస్థితిని వివరిస్తూ ఇండియా సాధించిన పురోగతిని ప్రస్తావించారు. ”కరాచీలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి.ఓవైపు ఇండియా చంద్రుడ్ని చేరితే, పాక్‌లో మాత్రం పిల్లలు మురుగు కాలువలో పడి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు.

 

 

టీవీలో ఇండియా చంద్రునిపై కాలుమోపిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే రెండు సెకన్లలో కరాచీలో ఓ మురుగు కాలువలో పడి ఓ పిల్లోడు చనిపోయాడనే వార్త వచ్చింది. ప్రతి మూడు రోజులకోసారి ఇలాంటి వార్తలే వస్తున్నాయి” అని అన్నారు. కనీసం మురుగు కాలువల్లో పిల్లలు చనిపోకుండా నివారించే చర్యలను సైతం చేపట్టలేని దారుణ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version