జగన్ అమెరికాకు వెళితే తిరిగిరాలేడు : టీడీపీ నేత బుద్దా వెంకన్న

-

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అమెరికాకు వెళితే మరల తిరిగిరాలేడని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలపై నోరు పారేసుకున్న నేతలంతా ఇప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న నేతలు సీఎం చంద్రబాబుతో లాలూచీ పడ్డట్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు.

ఏపీలో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో నమోదైన కేసు విచారణకు వైఎస్ జగన్ వెళితే ఇక ఎప్పటికీ ఆయన ఏపీకి తిరిగి రాలేరని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అధికారం ఉందని కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటికొచ్చినట్టు వాగారని, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదన్నారు. అలాంటి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.కొడాలి, వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడానికి కూడా అర్హులు కాదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version