కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.. హర్యానా ఓటమిని మరువక ముందే మరోషాక్ తగిలింది.. మహారాష్టలో 101స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ… కనీసం 20 స్థానాలు సాధించలేకపోయింది. మహాయుతి ధాటికి… ప్రాబల్యం కూడా కోల్పోయింది.. ఇదే కొనసాగితే.. ఆ రాష్టంలో మనుగడ కూడా సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
మహారాష్టలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైంది.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 99 స్థానాలను గెలచుకుని బిజేపీకి మెజార్టీ దక్కకుండా చేసింది.. అయితే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 18 స్థానాలకే పరిమితమైంది.. మహావికాస్ అఘాడి కూటమి ఘోర ఓటమిని చవిచూసింది.. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్.. తాజా ఓటమితో క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది..
మహారాష్టలో 34 ఏళ్లుగా కాంగ్రెస్ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయింది. 1990లో 49 శాతం ఓట్లతో 141 స్థానాలను సాధించిన కాంగ్రెస్.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడెంకల సంఖ్యను ఎప్పుడూ చేరుకోలేకపోయింది.. శరద్ పవార్ స్వంత పార్టీ పెట్టుకున్న తర్వాత 1995లో జరిగిన ఎన్నికల్లో 80 సీట్లకే పరిమితమై.. రెండోసారి అధికారానికి దూరమైంది.. హస్తం పార్టీకి అండగా ఉన్న మరాఠా ఓటర్లు ఎన్సీపికి దగ్గరయ్యారు.
2009లో అశోక్ చవాన్ నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్.. 82 సీట్లు సాధించింది.. 2014లో జరిగిన ఎన్నికల్లో మోడీ హవా ముందు నిలువలేకపోయింది.. కేవలం 42 సీట్లకే పరిమితమైంది.. అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన నానాటికి పతనం అవుతూ వచ్చింది.. కొన్నివర్గాలపై అధికంగా ఆధారపడటం, నేతల్లో సమన్వయం లేకపోవడం వంటి కారణాలే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..