టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్..RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త సన్నగా అయ్యి సిక్స్ ప్యాక్ తో ఆకర్షణీయంగా కనబడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవారు. రాఖీ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఇప్పటికి.. అప్పటికి బరువు విషయంలో చాలా తేడా ఉందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గితేనే ఒక సినిమా చేస్తానని చెప్పాడట స్టార్ డైరెక్టర్. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
అయితే ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్లో ఇప్పటికీ మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి వంటి సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. రాజమౌళి యమదొంగ సినిమా సమయంలో ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సమయంలో ఒక కండీషన్ పెట్టారట. అదే వెయిట్ లాస్ కండిషన్. యమదొంగ సినిమా కి ముందు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవారు. అయితే అంత లావుగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ డాన్స్ బాగా వేసే వారు. అయితే యమదొంగ స్టోరీ వినిపించిన తర్వాత రాజమౌళి వెయిట్ లాస్ అయితే సినిమా తీస్తానని చెప్పేశాడట.
దాంతో ఎన్టీఆర్ రాజమౌళి చెప్పిన మాటలు విని బరువు తగ్గేందుకు ఒప్పుకున్నాడట. ఇక దాదాపుగా సినిమా కోసం 30 కిలోల వరకు బరువుని తగ్గించుకున్నాడు ఎన్టీఆర్.. ఆ తర్వాత సినిమా మొదలు అయ్యిందట. ఇక అలా తన బరువు తగ్గిన అందువల్ల తనకు ఉన్న దరిద్రం కూడా పోయిందని ఎన్టీఆర్ ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. మొత్తానికి ఎన్టీఆర్ రాజమౌళి వల్లే వెయిట్ లాస్ అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ అదే ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ స్టార్ హీరో గా తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తన 30 వ సినిమాలో నటిస్తున్నాడు.