డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ తప్పులు చేస్తే సమస్యలే…!

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు డయాబెటిస్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ వున్నవాళ్లు కచ్చితంగా ఈ నియమాలని పాటించాలి లేకపోతే ప్రమాదం లో పడ్డట్టే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి ఒక్కరూ కూడా సరపడా నీళ్లు తాగుతూ ఉండాలి మంచి నీళ్లు తాగితే సమస్యలు తొలగిపోయినట్లే. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు మంచినీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలానే డయాబెటిస్ ఉన్నవాళ్లు బట్టర్, చీజ్, నెయ్యి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే పాలు పెరుగు పాల పదార్థాలను తీసుకోవచ్చు. ప్రమాదం ఉండదు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు తాజా కూరలు తీసుకుంటూ ఉండాలి.
అలానే రోజులో ఎప్పుడైనా సరే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.
అలానే కేకులు, స్వీట్స్, చాక్లెట్స్ వంటివి తీసుకోకూడదు ఎక్కువ షుగర్ ఉండేవి తీసుకుంటే మీకు ఇబ్బంది వస్తుంది.
అలానే రోజు టైం టు టైం భోజనం చేయండి. ఇలా చేయడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండడానికి అవుతుంది.
ఆహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు.
భోజనం చేసిన తర్వాత తీయగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగిపోతాయి.
అరటిపండు మామిడి పండ్లకు దూరంగా ఉంటే మంచిది లేదంటే తక్కువ తీసుకోండి. డయాబెటిస్ ఉన్నవాళ్లు కాకరకాయ, బెండకాయ, క్యాబేజీ, పుదీనా, క్యారెట్ వంటివి తీసుకోవచ్చు వీటి వలన మేలు తప్ప ఇబ్బంది ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version