ప్రాజెక్ట్ సెట్ అయితే రాం చరణ్ తో సినిమా చేస్తా ..కియారా అద్వాని

-

బాలీవుడ్ లో కియారా అద్వాని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేసిన కియారా ఆ సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు చేస్తున్న లక్ష్మీ బాంబ్ రెండవ సినిమా. ఇక రెమ్యూనరేషన్ పరంగా కూడా బాలీవుడ్ లో కియారా కి మంచి డిమాండ్ ఉంది. అయినా తను చేస్తున్న సినిమాలన్ని హిట్ అవుతుండటం తో మేకర్స్ లక్కీ హీరోయిన్ గా ఫీలవుతున్నారు. అందుకే ముందుగా తమ సినిమాలలో ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని టాలీవుడ్ సినిమాలని కమిటవలేక నో చెప్పింది. దాంతో కియారా ఇక టాలీవుడ్ లో సినిమాలు అంగికరించదన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది.

 

అయితే ఇప్పటికే టాలీవుడ్ లో కియారా అద్వాని రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసందే. మొదటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కాని ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా దారుణంగా ఫ్లాపవడంతో మళ్ళీ తెలుగు సినిమా నటించలేదు. కాని కొందరు కియారా రాం చరణ్ తో చేసిన ఈ సినిమా ఫ్లాపవడం వల్లే మళ్ళీ తెలుగులో అవకాశాలు రాలేదని, తెలుగు సినిమాలంటే కియారా ఆసక్తి చూపించడం లేదని ..ఇలా రక రకాలుగా వార్తలు రాశారు.

అయితే అసలు కారణం కాదు వరసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ డేట్స్ అక్కడ లాక్ అవడమే అని తాజా సమాచారం. అందుకే టాలీవుడ్ సినిమాలు చేయలేకపోయింది తప్ప మరే ఇతర కారణాలు లేవని క్లారిటీ వచ్చిందట. అంతేకాదు ఈ సారి మళ్ళీ తెలుగు మేకర్స్ గనక అప్రోచ్ అయితే సినిమా ఒప్పుకోవడానికి కియారా రెడీగా ఉందట. ముఖ్యంగా రాం చరణ్ సినిమా అయితే అసలు ఏమాత్రం ఆలోచించదని కియారానే రీసెంట్ గా తెలిపింది. ఇక కియారా కి చరణ్ మంచి ఫ్రెండ్ అంటూ తను ఎప్పుడు అడిగినా సినిమా చేస్తానని క్లారిటి ఇచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే రాం చరణ్ కియారా కాంబినేషన్ లో సినిమా మళ్ళీ ఉండబోతుందని తెలిసినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version