పెదాలు గులాబీ రంగులో మారాలంటే..!?

-

లేత గులాబీ రంగులో పెదాలు మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తెల్లగా ఉన్నవారికి లేత గులాబీ రంగు పెదాలు ఉంటేనే మొఖానికి అందం వస్తుంది. చలికాలంలో సహజంగా పేదాలు పగలడం చూస్తుంటాం. దీంతో పెదాలపై పొలుసులు రావడం, డ్రైగా మారిపోవడం జరుగుతుంటుంది. అందుకే లిప్ బామ్ లు వాడుతుంటాం. లిప్ బామ్ లు పేదాలను డ్రై కానియకుండా చేస్తాయే తప్ప రంగు మార్చవు. గులాబీ రంగు పేదాల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే లేత గులాబీ రంగులో మెరిసే పెదాలు మీ సొంతం.

lips

లేత గులాబీ రంగు పెదాలు కనిపించాలని అనుకుంటే వారానికి ఒకసారి న్యాచురల్ లిప్ స్ర్కబ్బర్ ను ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపైన ఉన్న మృతకణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ఫలితంగా పెదాలు సాధారణ రంగులోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక టీస్పూన్ చక్కెరలో కొన్ని ఆలివ్ ఆయిల్ చుక్కలను వేసి పొడిలాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసుకుంటే ఫలితం మీరే చేస్తారు.

ఒక వేళ కుదరకపోతే.. రాత్రి పడుకునేటప్పుడు పెదాలపై నిమ్మరసం రాసుకోవాలి. ఇలా కొన్ని నెలల పాటు చేస్తే డాల్క్ లిప్స్ ఆటోమెటిక్ గా లేత గులాబీ రంగులోకి మారిపోతాయి. లేదా ఒక నిమ్మకాయను తీసుకుని కట్ చేసుకోవాలి. సగం ముక్కపై కొంచెం పంచదార వేసుకోవాలి. దాన్ని నెమ్మదిగా పెదాలపై రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి పెదాల రంగు మారుతుంది.

డార్క్ లిప్స్ లేత గులాబీ రంగులోకి మారడానికి బీట్ రూట్ ఎంతో తోడ్పడుతుంది. బీట్ రూట్ లో న్యాచురల్ బ్లీచింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు పెదాలపై బీట్ రూట్ జ్యూస్ రాసుకుని ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే మంచి ఫలితాన్ని దక్కించుకుంటారు. దీంతోపాటు బీట్ రూట్, క్యారెట్ల మిశ్రమాన్ని పెదాలపై రాసి మర్దన చేస్తే పెదాల రంగు మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version