ఏపీలోని అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం అరకు బైపాస్ రోడ్డు సమీపంలో కొందరు గంజాయి స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. వారు గంజాయి తరిలిస్తుండగా అనకోకుండా రోడ్డు ప్రమాదం సంభవించింది. తమను ఎవరైనా గమనిస్తారేమో అని భావించిన స్మగ్లర్స్ వెంటనే వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
కారు బోల్తా కొట్టడంతో దానిని స్థానికులు లేపి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసుల కారులో తనిఖీలు చేయగా భారీగా గంజాయి బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం అరకు బైపాస్ రోడ్డు సమీపంలో గంజాయి తరిలిస్తుండగా రోడ్డు ప్రమాదం.
కార్‌ను వదిలి పారిపోయిన స్మగ్లర్లు. కారును రోడ్డుపైకి తీసుకొచ్చి తెరిచిన స్థానికులు.
భారీగా బయటపడ్డ గంజాయి .కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు. pic.twitter.com/mb0BFXtlRg— ChotaNews App (@ChotaNewsApp) March 22, 2025