పత్తికి రేటు బాగా పలకాలంటే రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

పత్తిని తెల్ల బంగారం అంటారు..మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తారు..డిమాండ్ కూడా ఎక్కువే..గతంలో వర్షాల కారణంగా పత్తి దిగుబడి సరిగ్గా లేదు..ఈసారి పత్తి పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఖరీఫ్ ముగిసే సమయంలో కురిసిన ఈ భారీ వర్షాలు దిగుబడుల్ని తీవ్రంగా ప్రభా వితం చేశాయి. తెలంగాణ సహా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాలుగైదు రోజుల పాటు పత్తి చేలల్లో నీరు నిలిచి నాణ్యత దెబ్బతింది.వర్షాల కారణంగా తేమశాతం పెరిగి పత్తి ధరలు దారుణంగా పతనమయ్యాయి..

 

 

నవంబరులో మార్కెట్లకు చేరిన పత్తికి నాణ్యతను బట్టి మంచి ధరలే అందాయి. నవంబరు ఆరంభంలో తీసిన పత్తికి వ్యాపారులు క్వింటాకు రూ.3400 వరకు ధర చెల్లిస్తున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.4320 ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతుల ఆందోళనల ఫలితంగా ఎట్టకేలకు కేంద్ర పత్తి సంస్థ రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతున్న దృష్ట్యా సి.సి.ఐ, మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులను కొనుగోలు పాయింట్లుగా గుర్తించి మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో 98 కి పైగా సిసిఐ కేంద్రాలు ఏర్పడ్డాయి. అంటే అక్టోబర్ తో పోలిస్తే నవంబర్ లో ధరలు భారీగా పెరిగాయి.

పత్తిని తొక్కేటప్పుడు అస్సలు నీళ్లను చల్లరాదు. ఇలాచేస్తే తేమశాతం పెరిగి రైతుకు దక్కే ధర పడిపోతుంది. పత్తిని గోనె సంచుల్లో తొక్కి మార్కెట్కు తరలిస్తే విక్రయానికి అనుమ తించరు. ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్లు, వ్యాన్లలో గుట్టలుగా పత్తిని తరలించాలి..తేమ శాతాన్ని పరిశీలించి తీసుకుంటారు..రైతులు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, జిరాక్స్, ఆధార్ కార్డు కాపీలను తీసుకెళ్లాలి.తేమ శాతం 13కు మించితే సి.సి.ఐ పత్తిని కొనుగోలు చేయదు. ఈ మేరకు తేమ శాతం ఆధారంగా ఎంతెంత ధరలు ఇస్తామన్నది సి.సి.ఐ ప్రటించింది. రైతులు ఈ అంశాల పట్ల అవగాహన పెంచుకుంటే వ్యాపారులు పత్తికి మంచి ధరలను అందుకోవచ్చు..వీటిని తప్పక గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version