తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్త : హైకోర్టు హెచ్చరిక

-

సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని హైడ్రా మీద తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను హైకోర్టు నిలదీసింది.

రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news