గ్యాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహాలపై శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరిగింది. దీనికి సీఎం రేవంత్ , ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు సైతం హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యూత్ కాంగ్రెస్, NSUI సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్నిపకడ్బందీగా నిర్వహించాలన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు.ఇక యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలన్నారు.ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉన్న వాళ్లను కూడా ఓట్లు వేయించేలా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి,సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు, నేతలకు సూచించారు.