సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట పర్యటన సందర్భంగా లగచర్ల రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారనే అనుమానంతో లగచర్ల రైతులను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం..
శుక్రవారం పోలెపల్లి ఎల్లమ్మ గుడికి రేవంత్ రెడ్డి వెళ్తారని తెలుస్తోంది. అయితే, లగచర్ల భూములే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఒకవైపు లగచర్ల రైతులు భూములు ఇవ్వమంటూ ఆందోళనలు చేస్తుండగా.. సీఎం రేవంత్ మాత్రం రైతులను ఒప్పించాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ పోలెపల్లి ఎల్లమ్మ గుడికి రేవంత్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో లగచర్లలో పెద్దఎత్తున పోలీసులు మోహరించినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి నారాయణపేట పర్యటన సందర్భంగా లగచర్ల రైతులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారనే అనుమానంతో లగచర్ల రైతులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు
నేడు పోలెపల్లి ఎల్లమ్మ గుడికి రేవంత్ రెడ్డి
లగచర్ల భూములే లక్ష్యంగా రేవంత్ రెడ్డి… https://t.co/nCBj9XAw9j pic.twitter.com/xZNjCm3L3b
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025